స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే: చంద్రబాబు

40చూసినవారు
స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే: చంద్రబాబు
AP: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు టాస్క్ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో విజయం సాధించకపోతే ఎమ్మెల్యేలు పనిచేసినట్టే కాదని స్పష్టం చేశారు. సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో కూటమి గెలవాల్సిందేనని సీఎం చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై పెట్టిందని, వ్యవస్థలను విధ్వంసం చేసిందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్