
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో నేడు భారీ వర్షాలు
AP: అల్పపీడనం ప్రభావంతో ఆదివారం నాడు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, సత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. ఇప్పటికే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.




