
కంబళదిన్నె ఎంపీటీసీ అభ్యర్థిగా గొరవ మల్లయ్య నామినేషన్ దాఖలు
, పెద్దకడబూరు మండలంలోని కంబళదిన్నె ఎంపీటీసీ వైకాపా అభ్యర్థిగా గొరవ మల్లయ్య గురువారం తన నామినేషన్ను దాఖలు చేశారు. వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో వైసీపీ నాయకులు రవిచంద్రారెడ్డి, భీమన్నలతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

































