
మైనర్ బాలికపై అత్యాచారయత్నం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఎం.వి. నగర్లోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి శివ భార్గవ అనే యువకుడు ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.






































