
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో వామపక్షాలు - సిపిఐ సిపిఎం
ఆలూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వామపక్ష పార్టీలు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, ప్రజల పక్షాన నిలుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి బరిలోకి దిగనున్నాయి. ఆలూరు మండలంలోని 16 ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు వామపక్ష అభ్యర్థులను పోటీకి నిలబెట్టాలని నిర్ణయించినట్లు నాయకులు తెలియజేశారు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు సిపిఐ మండల కార్యదర్శి ఎస్ ఎస్ బాషా, సిపిఎం జిల్లా నాయకులు నారాయణస్వామి, సిపిఎం తాలూకా సీనియర్ నాయకులు షాకీర్, చంద్రకాంత్ రెడ్డి తదితరులు ఈ విషయాన్ని తెలిపాయి.























