కర్నూలు జిల్లా ఆలూరులో సోమవారం ఎంపీటీసీ బోయ లక్ష్మీ అనారోగ్యంతో మృతి చెందారు. రెండు రోజుల క్రితం వచ్చిన ఎంపీటీసీ ఎన్నికల్లో ఆమె ఆలూరు 4వ స్థానం నుంచి పోటీ చేసి 716 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గెలిచిన కొద్ది రోజుల్లోనే ఆమె ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆమె మృతిపై పలువురు నాయకులు సంతాపం తెలిపారు. అనారోగ్య సమస్యల కారణంగా ఆమె మరణించినట్లు సమాచారం.