
పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం- రఫి
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ అమరవీరుల వారోత్సవాలు ముగిశాయి. అక్టోబర్ 15 నుండి 21 వరకు జరిగిన ఈ వారోత్సవాల్లో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, శాంతి భద్రతల కోసం ప్రాణాలర్పించిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని రఫి కొనియాడారు. నేటి మన నిశ్చింత జీవితం వారి త్యాగఫలమని పేర్కొంటూ, అమరవీరుల సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.
























