బేతంచెర్లలో ఎక్సైజ్ దాడులు

8చూసినవారు
బేతంచెర్లలో ఎక్సైజ్ దాడులు
డోన్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో బేతంచెర్ల మండలంలో సీఐ జఫ్ఫుల్ల ఆధ్వర్యంలో బుగ్గనపల్లె తండా కొండ ప్రాంతాల్లో దాడులు చేసి 200 లీటర్ల పులిసిన చక్కెర ఊటను ధ్వంసం చేశారు. సర్పంచ్ ఎన్నికల ముందస్తు చర్యల్లో భాగంగా ఐదుగురిని బైండోవర్ నిమిత్తం ప్యాపిలి తహశీల్దార్ ఎదుట హాజరుపరిచారు. ఈ దాడుల్లో ఎస్ఐ ఓ. సోమశేఖర్, దౌలత్ ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్