
అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి.. మృతదేహంపై బైక్!
గూడూరు – కర్నూలు రహదారిపై అనుమానాస్పద మృతి కలకలం రేపింది. కంకర మిషన్ ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తున్న ఓ వ్యక్తి శనివారం సాయంత్రం విధులు ముగించుకుని వెళ్లినట్లు సమాచారం. అయితే రాత్రి సమయంలో ఫ్యాక్టరీకి ఎదురుగా రోడ్డు అవతల ఉన్న గుంతలో అతను మృతిచెంది కనిపించాడు. మృతదేహంపై బైక్ పడివుండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో గొర్రెలు మేపుతున్న మహిళ పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇది ప్రమాదమా? మరేదైనా కారణమా? అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.






















