రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ గౌస్ దుర్మరణం

0చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ గౌస్ దుర్మరణం
కర్నూలు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్.ఎం.డి. గౌస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుక్రవారం ఉదయం ద్విచక్రవాహనంపై వాకింగ్‌కు వెళ్తుండగా, పంచలింగాల చెక్‌పోస్టు సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్