కర్నూలులోని రిచ్‌మండ్ హోమ్స్ హైదరాబాద్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శనివారం ఎడ్యు ఎక్స్‌పో-2026 కార్యక్రమాన్ని డీఎస్పీ ఎస్. మహబూబ్ బాషా ప్రారంభించారు. విద్యార్థుల సృజనాత్మకతను, విజ్ఞాన ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి ఎక్స్‌పోలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న విజ్ఞాన నమూనాలను, ప్రాజెక్టులను పరిశీలించి వారి ప్రతిభను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.