
హనుమాపురం ఎంపీటీసీ అభ్యర్థిగా పూజారి లక్ష్మి నామినేషన్
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం, పెద్దకడబూరు మండలం హనుమాపురం గ్రామ ఎంపీటీసీ వైకాపా అభ్యర్థిగా పూజారి లక్ష్మి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో వైసీపీ నాయకులు రవిచంద్రారెడ్డి, పూజారి ఈరన్నతో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభ్యర్థి పూజారి లక్ష్మి తన నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు.





































