కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం, పెద్దకడబూరు ఎస్సీ కాలనీలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో గడ్డివాము కాలిపోయి నష్టపోయిన రైతు అంబేద్కర్ కుటుంబాన్ని
టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును జరిగిన నష్టాన్ని రైతును అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ధైర్యం చెబుతూ ఈ కష్టకాలంలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైతు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆయన విచారం వ్యక్తం చేశారు.