మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్దకడబూరు, కోసిగి, కౌతాళం, మంత్రాలయం మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా నాలుగు మండలాల్లోనూ టీడీపీకి అత్యధిక ఓట్లు వచ్చాయి. పెద్దకడబూరులో టీడీపీకి 12, వైసీపీకి 6, సీపీఐకి 1, నోటాకు 1 ఓటు వచ్చాయి. కోసిగిలో
టీడీపీ 8,
వైసీపీ 6, నోటా 1; మంత్రాలయంలో
టీడీపీ 9,
వైసీపీ 8, స్వతంత్ర అభ్యర్థికి 1, నోటాకు 1; కౌతాళంలో
టీడీపీ 6,
వైసీపీ 2 ఓట్లు రాగా, ఒక ఓటు చెల్లనిదిగా నమోదైంది. అనంతరం సాధారణ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.