
ప్రమాదాల నివారణకు ఎస్సై మణికంఠ చర్యలు
బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్సై మణికంఠ చర్యలు చేపట్టారు. వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు రహదారిపై స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయించారు. వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని చర్యలు చేపడతామని ఎస్సై తెలిపారు.


























