
డివైడర్ను ఢీకొని స్కార్పియో నుజ్జునుజ్జు
నంద్యాల జిల్లా పాణ్యం మండలం విజయానికేతన్ స్కూల్ సమీపంలో అతివేగంతో వస్తున్న స్కార్పియో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. వాహనం నుజ్జునుజ్జు అయింది కానీ ప్రాణనష్టం జరగలేదు. క్రేన్ సహాయంతో వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
























