శ్రీశైలం - Srisailam

శ్రీకాకుళం అంబేడ్కర్ విగ్రహం కప్పివేతపై ఎమ్మార్పీఎస్ నిరసన

శ్రీకాకుళం అంబేడ్కర్ విగ్రహం కప్పివేతపై ఎమ్మార్పీఎస్ నిరసన

శ్రీకాకుళం జిల్లా నైరా అగ్రికల్చర్ కాలేజీలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి ముసుగు వేయడంపై నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బుధవారం సున్నిపెంటలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో శ్రీశైలం మండల అధ్యక్షుడు వేశపోగు కమలాకర్ మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనల పేరుతో రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని కప్పివేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని మరియు దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి ప్రసన్న బాబు, యలమంటి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా