
ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్ పదవి జనసేనకు కేటాయించాలి
ఎమ్మిగనూరు మున్సిపల్ ఛైర్మన్ పదవిని జనసేన పార్టీకే కేటాయించాలని ఆ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ చల్లా వరుణ్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఛైర్మన్ పదవి అంశాన్ని కూటమి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విన్నవించినట్లు తెలిపారు.

































