కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో, గోనెగండ్ల సమీపంలో ఉల్లిగడ్డలు అమ్ముకుని విశ్రాంతి తీసుకుంటున్న దంపతుల వద్ద రూ. 10 వేల నగదు చోరీకి గురైంది. హోలగుంద మండలం హెబ్బటం కు చెందిన ఎరుకల సౌరప్ప, పార్వతి గోనెగండ్లకు వచ్చి వ్యాపారం ముగించుకుని నయారా పెట్రోల్ బంకు వద్ద నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నగదును అపహరించి పరారయ్యారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో అనుమానాస్పద మృతుల కేసులను, రైతుల మోటార్ల చోరీలను కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.