ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి: మంత్రి లోకేశ్

1747చూసినవారు
ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి: మంత్రి లోకేశ్
AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని మంత్రి లోకేశ్ తెలిపారు. 22,800కు పైగా నామినేషన్లు దాఖలు కావడమే దీనికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఓట్లు పడకముందే ఎన్నికలపై ఆరోపణలు చేసేవారు, ప్రజాక్షేత్రంలోనే గెలుపోటములు ఆధారపడతాయని గుర్తించాలని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి అన్నారు. మరోవైపు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. మున్సిపల్ ఛైర్మన్ పదవికి 13 నామినేషన్లు, 32 వార్డులకు గాను మొత్తం 282 నామినేషన్లు దాఖలయ్యాయి.

సంబంధిత పోస్ట్