AP: డీఎస్సీ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో చాలా మందికి
ఉద్యోగాలు ఇచ్చారని, అయితే విమర్శలు రావడంతో కూటమి ప్రభుత్వం ఆ జీవోను వెనక్కి తీసుకుందని మాజీ డిప్యూటీ సీఎం
పుష్ప శ్రీ వాణి తెలిపారు. డీఎస్సీ నియామకాల్లో బోలెడు అక్రమాలు జరిగినట్లు సాక్ష్యాలు బయటపడ్డాయని, ఈ అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.