
ఏపీలో పురపాలక ఎన్నికలు.. ఈ నెల 22న ఓటర్ల జాబితా
AP: రాష్ట్రంలో పురపాలక ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాచరణ మొదలుపెట్టింది. 12 నగరపాలికలు, 29 పురపాలికల్లో ఓటర్ల జాబితా తయారీకి ఈసీ కసరత్తు పూర్తి చేసింది. ఈ మేరకు రెండు ప్రత్యేక నోటిఫికేషన్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సంతకాలు చేశారు. వార్డుల వారీగా ఈ నెల 22న ఓటర్ల జాబితాను ప్రచురించాలన్నారు. ఈ నిర్ణయంతో త్వరలో మేయర్లు, ఛైర్మన్లు, వార్డుల సభ్యుల రిజిర్వేషన్లకు లైన్ క్లియర్ కానుంది.






























