ఆత్మకూరు - Aatmakur

వికారాబాద్ జిల్లా
నెలరోజుల అసెంబ్లీ సమావేశాల కోసం బీఆర్ఎస్ ఒత్తిడి: హరీశ్‌రావు
Sep 06, 2026, 12:09 IST/

నెలరోజుల అసెంబ్లీ సమావేశాల కోసం బీఆర్ఎస్ ఒత్తిడి: హరీశ్‌రావు

Sep 06, 2026, 12:09 IST
TG: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యిరోజుల పాలనలో అన్నివర్గాలనూ మోసం చేసిందని, రైతులకు, నిరుద్యోగులకు, బలహీనవర్గాలకు, మహిళలకు ద్రోహం చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలను నెలరోజులపాటు నిర్వహించేలా ఒత్తిడి తేవాలని కేసీఆర్ సూచించారని తెలిపారు. సభలో మాట్లాడాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయన పలు సూచనలు చేశారని, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి అంశాలపై నిలదీయాలని చెప్పారని హరీశ్‌రావు పేర్కొన్నారు.