Sep 22, 2026, 11:09 IST/
ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Sep 22, 2026, 11:09 IST
TG: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు భారీ నుంచి అతిభారీ వానలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. మంగళవారం వరంగల్, హనుమకొండ, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారీ వానలు కురిసే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. బుధవారం కూడా ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.