Nov 15, 2026, 16:11 IST/
నిజామాబాద్లో కేసీఆర్ భారీ బహిరంగ సభకు రంగం సిద్ధం
Nov 15, 2026, 16:11 IST
TG: పీసీసీ చీఫ్ సొంత జిల్లా నిజామాబాద్లో బీఆర్ఎస్ రైతు గర్జన సభ వాయిదా పడింది. పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ నెల 19న జరగాల్సిన కేటీఆర్ సభ ఆగిపోయిందని సమాచారం. దీనికి బదులుగా డిసెంబర్లో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా నిజామాబాద్లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారని ప్రచారం జరుగుతోంది. జిల్లాలో పార్టీ పూర్వవైభవం కోసం, బీజేపీ పెరుగుతున్న ప్రభావానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా అధినేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.