Sep 12, 2026, 06:09 IST/
4,098 రైల్వే ఉద్యోగాలు.. రేపటి వరకే ఛాన్స్
Sep 12, 2026, 06:09 IST
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజినీర్ (JE), డిపాట్ మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) తదితర పోస్టుల భర్తీకి 4,098 ఖాళీలతో CEN 04/2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 14న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 13తో ముగియనుంది. పోస్టును బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. రేపే లాస్ట్ డేట్ కావడంతో అర్హులు rrbapply.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.