Oct 11, 2026, 12:10 IST/
బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Oct 11, 2026, 12:10 IST
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి నిశ్చయమైందని ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ఆగ్రహించిన శ్రీపాద్ దింకర్ (25), తరణ్ణుమ్ బషీర్ నాయక్ (23)ను లోయలోకి తోసేశాడు. అక్టోబర్ 9న ఈ ఘటన జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆమె కనిపించడం లేదని చెప్పాడు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. యువతి మృతదేహాన్ని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.