
వాకింగ్ చేస్తుండగా గుండెపోటుతో వ్యక్తి మృతి
కావలి పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో ఉన్న మినీ స్టేడియం మైదానంలో శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. దంతంవారి వీధికి చెందిన కె.హరి అనే వ్యక్తి వాకింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. సహచర వాకర్స్ అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.































