
ఆన్లైన్ క్విజ్లలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలి.. యువజన అధికారి
యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, వికసిత్ భారత్ నిర్మాణంలో వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా యువజన అధికారి ఏ. వి. నరసింహ కుమార్ ఆధ్వర్యంలో ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మంగళవారం తెలిపారు. ఈ పోటీలలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.



























