ముత్తుకూరు - Muthukur

వికారాబాద్ జిల్లా
పల్నాడులో దారుణం.. స్నేహితుడిని రాయితో కొట్టి చంపిన వ్యక్తి!
Oct 02, 2026, 12:10 IST/

పల్నాడులో దారుణం.. స్నేహితుడిని రాయితో కొట్టి చంపిన వ్యక్తి!

Oct 02, 2026, 12:10 IST
AP: పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలో శుక్రవారం స్నేహితుల మధ్య జరిగిన గొడవలో శ్రీనివాసరావు అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న ముగ్గురు స్నేహితుల మధ్య ఒక మహిళను వేధించిన విషయంలో ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో రాజు అనే వ్యక్తి శ్రీనివాసరావుపై రాయితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. రాజును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు మహిళ వేధింపులే కారణమా లేక దొంగతనం సొత్తు విషయంలో గొడవ జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.