
వేడి సాంబారు పడి పలువురుకి గాయాలు
ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లాం బ్రహ్మోత్సవాల్లో అన్నదానం సందర్భంగా బుధవారం విషాదం చోటుచేసుకుంది. కల్యాణోత్సవాల్లో భాగంగా భారీ అన్నదానం కోసం వంట చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఉడికిన సాంబారు సిబ్బందిపై పడింది. ఈ దుర్ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను నాయుడుపేటలోని ఆసుపత్రికి తరలించగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు.






























