
వైద్యం వికటించి వ్యక్తి మృతి
నెల్లూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందాడు. గుండెపోటుతో మరణించాడని వైద్యులు చెబుతుండగా, వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణం సంభవించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంధువులు ఆసుపత్రిపై దాడికి దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.































