Oct 13, 2026, 08:10 IST/
రూ.500 కోట్ల క్లబ్లో 'దృశ్యం 3'
Oct 13, 2026, 08:10 IST
అజయ్ దేవ్గన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం: ది కన్క్లూజన్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సోమవారం కూడా రూ.6 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో రెండో స్థానానికి చేరినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం దృశ్యం ఫ్రాంచైజీలో చివరి భాగంగా ప్రచారం పొందుతోంది.