Sep 06, 2026, 06:09 IST/
"బోడి టీచర్" ఉద్యోగం అంటూ ఉపాధ్యాయ వృత్తిని అవమానించిన ఎమ్మెల్యే
Sep 06, 2026, 06:09 IST
TG: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను ఉద్దేశించి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. "పాటలు, డ్యాన్సులు చేసి పైసలు అడుక్కునే వాడివి.. అంత పెద్ద ఇల్లు ఎలా వచ్చింది? నువ్వు చేసిందే బోడి టీచర్ ఉద్యోగం కదా" అని ఆయన వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ దినోత్సవం నాడే టీచర్ ఉద్యోగాన్ని అవమానించేలా మాట్లాడటంపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.