
మనుబోలు మండలంలో మోస్తరు వర్షం
మనుబోలు మండలంలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం ఉరుములు, ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఎండ కాసింది. మధ్యాహ్నం మబ్బులు కమ్ముకునీ వాతావరణం ఒక్కసారిగా వర్షంగా మారింది. వర్షపు నీరు రోడ్లపై చేరింది. వాహనదారులు, చిరువ్యాపారులు, వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో గ్రామాల్లో వాతావరణం చల్లబడింది. వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


























