
కూటమి విజయానికి ఐకమత్యంతో పనిచేయాలి: చింతల శ్రీనివాసులు
సీతారామపురం మండలం బసినేనిపల్లి పంచాయతీలో టీడీపీ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొన్న కూటమి నాయకుల ఆత్మీయ సమావేశం బుధవారం జరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి ఐకమత్యంతో పనిచేయాలని ఆయన సూచించారు. కూటమి నాయకులకు అవసరమైన సహకారం అందిస్తామని ముడమాల రమేష్రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
































