Sep 25, 2026, 04:09 IST/మల్కాజ్గిరి
మల్కాజ్గిరి
బ్రెడ్ డౌన్ అయిన కంటైనర్ ని ఢీకొట్టిన ద్విచక్ర వాహనదారుడు
Sep 25, 2026, 04:09 IST
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్లంపేట జాతీయ రహదారిపై నిలిచిపోయిన కంటైనర్ను బైక్ ఢీకొన్న ఘటన ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో చోటుచేసుకుంది. తూప్రాన్ నుంచి మేడ్చల్కు బైక్పై వస్తున్న 27 ఏళ్ల యువకుడు ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపానికి చేరుకున్నాడు. అదే సమయంలో జాతీయ రహదారిపై కంటైనర్ బ్రేక్డౌన్ కారణంగా నిలిచిపోయింది. దాన్ని ఢీకొట్టడంతో వాహనం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ యువకుడికి ప్రాణాపాయం తప్పింది. గాయాల తీవ్రత తెలియాల్సి ఉంది.