Sep 22, 2026, 06:09 IST/
ఉచిత టిఫిన్ పథకం ప్రారంభం.. మెనూ ఇదే
Sep 22, 2026, 06:09 IST
తమిళనాడు ప్రభుత్వం పాఠశాల పిల్లల కోసం అందిస్తున్న ఉదయం అల్పాహార పథకాన్ని ముఖ్యమంత్రి సీ. జోసెఫ్ విజయ్ మంగళవారం విస్తరించారు. తిరువాన్మియూర్ గాంధీ గ్రామంలోని ప్రభుత్వ మిడిల్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని పిల్లలకు టిఫిన్ వడ్డించారు. దివంగత పూర్వ ముఖ్యమంత్రి కే. కామరాజ్ గౌరవార్థం ఈ పథకానికి “పెరుంతలైవర్ కామరాజర్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్” అని పేరు పెట్టారు. ఇప్పటివరకు ప్రాథమిక స్థాయికే పరిమితమైన ఈ ఉచిత టిఫిన్ పథకాన్ని ఇప్పుడు 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా విస్తరించారు.