
టీడీపీ కార్యదర్శి పంపిణీ చేసిన పింఛన్లు, బీసీ రిజర్వేషన్లపై హర్షం
వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలంలోని సిద్ధాలయ సెంటర్ కుమ్మరవిధి, శివాలయం సెంటర్లలో మంగళవారం రాపూరు మండల టీడీపీ కార్యదర్శి పిల్లకదుపు నరేంద్ర యాదవ్ NTR సామాజిక పింఛను కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన అవ్వ తాతలకు ఎక్కువ మొత్తంలో, ఉదయం 7 గంటలకే పింఛను పంపిణీ చేశారు. ఇది పేదల ప్రభుత్వం అని, ఇక్కడ పేద ప్రజలకు అన్యాయం జరగదని ఆయన అన్నారు. బీసీలకు ఇటీవల పెంచిన 34% రిజర్వేషన్లపై నరేంద్ర యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.























