ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో కీలక మార్పులు
Sep 26, 2026, 16:09 IST/

జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో కీలక మార్పులు

Sep 26, 2026, 16:09 IST
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (అమెండ్మెంట్) యాక్ట్, 2026 పేరుతో కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. ఇకపై జననం లేదా మరణం జరిగిన తేదీ నుండి 21 రోజుల్లోగా నమోదు చేసుకోవాలి. ఆలస్యంగా నమోదు చేసుకుంటే ప్రక్రియ కఠినతరం అవుతుంది. ముఖ్యంగా రెండేళ్లు దాటిన తర్వాత నమోదుకు జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశం తప్పనిసరి. ఈ నిబంధనలు జవాబుదారీతనాన్ని, ప్రామాణికతను పెంచడానికి, సకాలంలో నమోదును ప్రోత్సహించడానికి ఉద్దేశించబడ్డాయి.