AP: వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల విధానం అమలు కానుంది. ప్రస్తుతం 62 లక్షల మందికి పింఛన్లు అందజేస్తుండగా, కేంద్రం 9.34 లక్షల మందికి తన వాటాను నేరుగా ఖాతాల్లో జమ చేయనుంది. ఈ కొత్త విధానంలో 60-79 ఏళ్ల వృద్ధులకు రూ.200, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500, 40-79 ఏళ్ల వితంతువులకు రూ.300, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500, 18-79 ఏళ్ల వారికి రూ.300, 80 ఏళ్లు పైబడిన వారికి రూ.500 చొప్పున పింఛన్లు అందించనున్నారు. అధికారులు లబ్ధిదారుల ఖాతాలను యాక్టివేట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.