డ్రైనేజీలో అప్పుడే పుట్టిన పసికందును పడేశారు (వీడియో)

36చూసినవారు
AP: విశాఖపట్నం జిల్లాలోని పిఠాపురం కాలనీలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు డ్రైనేజీలో పడేశారు. శిశువు ఏడుపు శబ్దాలను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి పసికందును రక్షించి, ఎంవీపీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఎస్ఐ సీతారాం చేరుకుని శిశువును మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు క్షేమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్