పంచాయతీ ఎన్నికల్లో పంపకాల్లేవు: జనసేన కీలక ఆదేశాలు

57చూసినవారు
పంచాయతీ ఎన్నికల్లో పంపకాల్లేవు: జనసేన కీలక ఆదేశాలు
ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ జనసేన పార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే పార్టీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేయవచ్చని స్పష్టం చేసింది. పోటీ చేయాలనుకునే వారిని పార్టీ నాయకులు అడ్డుకోవద్దని ఆదేశించింది. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తరహాలో పంచాయతీ ఎన్నికల్లో స్థానాల పంపకాలు ఉండవని వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్