'రప్పా రప్పా' రాజకీయాలు వద్దు: సీఎం చంద్రబాబు (వీడియో)

9చూసినవారు
AP: ‘నేరస్థులను తయారు చేయడం, మంచి వారిని నేరస్థులుగా మార్చడం గొడ్డలి పార్టీకి అలవాటు’ అని సీఎం చంద్రబాబు ఆరోపించారు. జగన్‌ను దావూద్‌ ఇబ్రహీంతో పోలుస్తూ విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ హింసను నమ్ముకుంటోందని వైసీపీపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేయాలని, అందుకోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హింస, తీవ్రవాద ధోరణులను విడనాడి ప్రధాన స్రవంతిలోకి రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇలాంటి ‘రప్పా రప్పా’ రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్