మహిళ స్థానానికి పురుషుడి నామినేషన్

3చూసినవారు
మహిళ స్థానానికి పురుషుడి నామినేషన్
ఏపీలోని అనంతపురం జిల్లా విడపనకల్లులో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. జనరల్ మహిళలకు కేటాయించిన ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ తరఫున బెస్త సురేశ్ అనే పురుషుడు నామినేషన్ దాఖలు చేశారు. మొదట రిటర్నింగ్ అధికారి (RO) నాసరరెడ్డి ఈ నామినేషన్ స్వీకరించి వాట్సాప్ గ్రూపులో పంచుకోవడంతో స్థానికంగా గందరగోళం నెలకొంది. అయితే, నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో భాగంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఆ నామినేషన్‌ను తిరస్కరించినట్లు RO వెల్లడించారు.

సంబంధిత పోస్ట్