AP: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆదివారం భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలలోగా ఆర్వో కార్యాలయంలో ఉన్న వారు మాత్రమే నామినేషన్ వేసే అవకాశం కల్పించారు. ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు. సోమవారం నామినేషన్లు పరిశీలన ఉంటుంది.