AP: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం నాగవరం సహా పలు గ్రామాల్లో ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగవరం గ్రామంలో మారణాయుధాలతో వచ్చినట్లు అనుమానిస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశోక్ లేలాండ్ వాహనంతో పాటు కార్లను స్వాధీనం చేసుకుని క్రోసూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన అల్లరిమూకలపై అప్రమత్తమైన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.