
రాగల 24 గంటల్లో ఏపీలో అతి భారీ వర్షాలు: వాతావరణ శాఖ
AP: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర కోస్తాంధ్ర వైపు వేగంగా కదిలి, కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. దీని ప్రభావంతో రాగాల 24 గంటలో ఉత్తర కోస్తాంధ్రలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, గంటకు 50-70 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. మత్స్యకారులను వేటకు వెళ్లవద్దని ఆదేశించారు.




