స్విట్జర్లాండ్ కాదు.. మన ఏపీ: సీఎం చంద్రబాబు (వీడియో)

2చూసినవారు
AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు మారుమూల ప్రాంతాల అందాలను చూపించే వీడియోను సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఇది స్విట్జర్లాండ్ కాదు.. మన ఆంధ్రప్రదేశ్‌’ అంటూ వ్యాఖ్యానించారు. ఓ గిరిజన ఇన్‌ఫ్లుయెన్సర్ రూపొందించిన ఈ వీడియోపై స్పందించిన సీఎం.. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. పచ్చని కొండలు, ప్రకృతి అందాలతో అలరారే అరకు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకుల తాకిడి పెరుగుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత పోస్ట్