AP: గోదావరిలో ఆంధ్రా పేపర్ మిల్లు కాలుష్యంపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించారు. ఈ మేరకు ఆంధ్రా పేపర్ మిల్లు యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. పేపర్ మిల్లు కాలుష్య వ్యవహారం న్యాయస్థానంలో ఉందని, కోర్టులో పోరాడేందుకు లాయర్లను నియమించామని తెలిపారు. పేపర్ మిల్లు కాలుష్య గుర్తింపునకు నమూనాలు సేకరించామన్నారు. ప్రత్యేకంగా కమిటీ నియమించి కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.